నల్గొండలో బాంబుదాడులు.. గాయాలు, ఇళ్లు బుగ్గి - MicTv.in - Telugu News
mictv telugu

నల్గొండలో బాంబుదాడులు.. గాయాలు, ఇళ్లు బుగ్గి

April 15, 2019

నల్గొండ జిల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడులు చేశారు. నాటుంబాంబులు, బీరుసీసాలు విసురుకుంటూ బీభత్సం సృష్టించారు. ఇళ్లలోకి దూరి విధ్వంసానికి పాల్పడ్డారు. 20 ఇళ్లు, కొన్ని బైకులు అగ్నికి ఆహుతయ్యాయి.

Trs and congress activists clash in nalgonda district of telangana over recent parliamentary polling 20 houses gutted

తిరుమలగిరి మండలం నాయకుని తండాలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు సంబంధించి గొడవ జరిగింది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే దాడులు సాగాయి. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు గ్రామానికి చేరుకుని 144 సెక్షన్ విధించారు. పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌కూ ఈ ఘర్షణలతో సంబంధముందని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.