దసరాకల్లా గులాబీ గూళ్లు సిద్ధం కావాలి.. కేసీఆర్  - MicTv.in - Telugu News
mictv telugu

దసరాకల్లా గులాబీ గూళ్లు సిద్ధం కావాలి.. కేసీఆర్ 

July 17, 2019

TRS bungalows to be prepared till Dasara .. CM KCR....

జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణాలను దసరా నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు ఆదేశించారు. బుధవారం తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ  మంత్రి , ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని కేసీఆర్ చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై కూడా మాట్లాడారు. అన్నీ జిల్లాలలో టీఆర్ఎస్ కార్యాలయాలను నిర్మించాలని అనుకున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే 29 జిల్లాల్లో శంకుస్థాపనలు కూడా పూర్తయ్యాయి. ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ.60 లక్షలు చెక్కును, భవన నిర్మాణ ప్రణాళికను బాధ్యులకు ఇవాళ  అందజేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్మించే జిల్లా పార్టీ కార్యాలయ భవన నమూనా, సంబందిత చెక్కును కేసీఆర్, హరీశ్ రావుకు అందజేశారు…

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘నిబంధనలనకు లోబడి నిర్మాణం పూర్తి చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు ఆశాజనకంగా జరుగుతోంది. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలి. గ్రామ కమిటీల ఏర్పాటు కూడా ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలి’ అని ఆదేశించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పోడు రైతులను అటవీ శాఖ అధికారులు వేధిస్తున్నారంటూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అతి త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.