యువతిపై టీఆర్ఎస్ కార్పొరేటర్ దాడి..  - MicTv.in - Telugu News
mictv telugu

యువతిపై టీఆర్ఎస్ కార్పొరేటర్ దాడి.. 

September 14, 2020

TRS Corporator On Teenage Girl .

యువతిపై టీఆర్ఎస్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ రెచ్చిపోయాడు. దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నాడు. శేరిలింగంపల్లిలో ఈ సంఘటన జరిగింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. కార్ పార్కింగ్ విషయంలోనే ఈ వివాదం జరిగిందని పేర్కొన్నారు. కార్పొరేటర్ మాత్రం దాడి సంఘటనను ఖండిస్తున్నాడు. కేవలం వీడియో తీయవద్దని మాత్రమే వారించానని చెప్పుకొచ్చాడు. 

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్  లక్ష్మీ విహార్ పేజ్2 కాలనీలో ఉంటున్నాడు. అదే కాలనీలో  వేణుగోపాల్‌ కుటుంబం కూడా ఉంటోంది. వేణుగోపాల్ కూతురు రాత్రి సమయంలో కారు వేసుకొని రాగా.. అక్కడ నాగేందర్ కారు అడ్డంగా నిలిపి ఉంచాడు. దీంతో దాన్ని తీసే విషయంలో ఇరువురి మధ్య గొడవ మొదలైంది. ఈ వ్యవహారాన్ని వేణుగోపాల్ రెండో కూతురు వీడియో తీసింది. దీన్ని కార్పొరేటర్ అడ్డుకునే సమయంలో గొడవ మరింత పెద్దది అయింది. తమను ఆయన దుర్భాషలాడాడని యువతి ఆరోపించింది.