TRS Ex Leaders Waiting For KCR Call
mictv telugu

కేసీఆర్ పిలుపుకోసం వెయిటింగ్..!

November 15, 2022

బీజేపీలోకి వెళ్లిన మాజీ గులాబీ నేతలు ఆలోచనలో పడ్డారా? కేసీఆర్ పిలుపుకోసం ఎదురుచూస్తున్నారా? సార్ కాల్ వస్తే ప్రగతిభవన్‌లో వాలిపోతారా? హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కూ తలుపులు తెరిచే ఉన్నాయా? వెనక్కి రప్పించేందుకు గులాబీ వర్గాలు మంతనాలు సాగిస్తున్నాయా?సార్ కాల్ వస్తే పీచేముఢ్ అంటారా?చోటామోటా నాయకులు వెళ్లినా ఈటల పరిస్థితి ఏంటి?ఆయన యుటర్న్ తీసుకుంటారా?తెలంగాణలో ఏం జరగబోతోంది.

రా రమ్మని…

తెలంగాణ రాజకీయం విచిత్రంగా సాగుతుంది. మునుగోడు బై పోల్ నుంచి రివర్స్ ట్రెండ్ మొదలైంది. టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన నాయకుల్ని తెలంగాణ భవన్ రా రమ్మని పిలుస్తోంది. కొందరిని కేటీఆర్ ఆహ్వానిస్తే ఇంకొందరు వాళ్లంతటవాళ్లే టీఆర్ఎస్ నేతల్ని అప్రోచ్ అయ్యారు. పేరున్న నేతలు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఉపఎన్నిక వేళ స్వామిగౌడ్ ,దాసోజు శ్రవణ్, భిక్షమయ్య గౌడ్ మళ్లీ కారెక్కారు. ఇప్పుడు ఇదే బాటలో మిగతా వాళ్లు నడుస్తారని ప్రచారం జరగుతోంది పార్టీ వీడిన అందరినీ 2023 అసెంబ్లీ ఎన్నికలవరకు వెనక్కి రప్పించే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.

తొలి టార్గెట్ ఈటల

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికలో అన్నీతానై నడిపించారు. కానీ చివరిరోజు జరిగిన ఇష్యూ ఈటలని హార్ట్ చేసిందని ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారని ఊహాగానాలు వచ్చాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు టీఆర్ఎస్ రెడీగా ఉందట. ఈటల రాజేందర్‌ను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించాలని యోచిస్తుందట టీఆర్ఎస్‌ని వీడిన నేతలందరినీ రప్పించేందుకు కేసీఆర్ బ్లూ ప్రింట్ రెడీ చేశారని తెలుస్తోంది. బీజేపీలో ఫ్యూచర్ ఉండదని చెబుతున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ తొలి టార్గెట్ ఈటల రాజేందరేనని తెలుస్తోంది. కేసీఆర్ నుంచి పిలుపు వస్తే ఈటల రాజేందర్ తిరస్కరించరని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్లిన చాలామంది నేతలు ప్రగతిభవన్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.

ఈటల మనస్సు మారుతుందా?

ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ని వీడిన చాలారోజులవరకు కేసీఆర్ పై పెద్దగా విమర్శలు చేయలేదు. ప్రగతిభవన్ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని ఎదురుచూసిపట్టే ఆ మాటలు ఉండేవి. వెళ్లే ముందు కేసీఆర్‌ని ఎలాగైనా కలువాలని ఈటల ప్రయత్నించారు.కానీ కుదరలేదు. కేసీఆరే పిలుస్తారని భావించారట, ఇదీ జరగలేదు. క్రమంగా కేసీఆర్ పై ఈటల రాజేందర్ డోస్ పెంచడం స్టార్ట్ చేశారు. కేసీఆర్ వ్యూహాలు దగ్గర్నుండి చూసిన ఈటల మునుగోడులో బీజేపీకి దిక్సూచిలా మారారు. మునుగోడులో ఎలాగైనా బీజేపీని దెబ్బకొట్టాలని భావించిన కేసీఆర్ టీఆర్ఎస్‌ని వీడిన కొందరిని వెనక్కి రప్పించారు. వచ్చే ఎన్నికల నాటికి మిగతా వారిని రప్పించాలని చూస్తున్నారు.ఇందులో భాగంగా ఈటలపై గులాబీ బాస్ ఫోకస్ చేశారని తెలుస్తోంది.

బీజేపీ నేతలు ఏమంటున్నారంటే..

అయితే ఈటల వెళ్లరని బీజేపీ నేతలు కొందరుంటున్నారు. మళ్లీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ప్రజలు నమ్మరని, అందుకే ఈటల బీజేపీలోనే ఉంటారని చెబుతున్నారు. అయినా టీఆర్ఎస్ ఇచ్చేదానికన్నా ఎక్కవ ప్రయారిటీనే ఈటలకు ఇస్తున్నామని చెప్పారు. చూడాలి ఏం జరుగుతుందో?