ఓడిపోతే ఉరేసుకుంటా.. నార్కోకు సై: రాములు నాయక్ - MicTv.in - Telugu News
mictv telugu

ఓడిపోతే ఉరేసుకుంటా.. నార్కోకు సై: రాములు నాయక్

October 17, 2018

టీఆర్ఎస్ బహిష్కృత నేత రాములు నాయక్ సంచలన వ్యాఖ్యల చేశారు. కాంగ్రెస్‌తో తాను కలవలేదని, దీనిపై నార్కో పరీక్షకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తనకు ఏ పార్టీ టికెట్టూ అవసరం లేదని, గిరిజన రిజర్వేషన్లను మాత్రమే తాను కోరుతున్నానని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో గిరిజన రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు.

TRS expelled leader Ramulu Naik dares for lie detector test over congress alliance and he will be hanged if he lost the election in Narayankhed

రాములు నాయక్ తన బహిష్కరణపై బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ‘టీఆర్ఎస్‌తో నా ఇరవై ఏళ్ల బంధాన్ని 20 నిమిషాల్లో బొందపెట్టారు. నేను కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరపనే లేదు. నాకు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా అహంకారంతో సస్పెండ్ చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ను స్విచ్ఆఫ్ చేసేందుకు మందకృష్ణ, ఆర్.కృష్ణయ్య నాతో చేతులు కలపాలి.  నారాయణఖేడ్లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను.  భూపాల్రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చెయ్యాలి. నేను ఓడిపోతే ఉరేసుకుంటాను..కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో సరిగ్గా లేదు. రిజర్వేషన్ల అంశం లేదు’ అని అన్నారు. కాగా, రాములు నాయక్ రేపోమాపో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి.