తెలంగాణ పోరాటంలో అరగుండు ,అరమీసం తీసేకున్న గాంధీనాయక్ గుర్తున్నాడా… అదేనండి తెలంగాణ వచ్చేదాకా అరమీసం, అరగుండుతోనే ఉంటానన్న వరంగల్ టీఆర్ఎస్ గిరిజన నాయకులు ఉద్యమ సమయంలో అందరినీ ఆకర్షించాడు. మంత్రి కేటీఆర్ గతంలో అతన్ని అభినందించారు కూడా. ఉద్యమంలోనే కాదు తెలంగాణ వచ్చాక పార్టీ కార్యక్రమాల్లో గాంధీనాయక్ చురుగ్గా పాల్గొంటున్నారు. ఇతనికి సీఎం కేసీఆర్ గుర్తు పెట్టుకుని మరి చైర్మన్ పదవి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా గాంధీ నాయక్ ని నియమించారు. వరంగల్ జిల్లాలోని కొడకొండ్ల మండలం గిర్నిగడ్డతండాకు చెందిన ఉద్యమకారుడు, ఎస్టీ సెల్ నాయకులు గాంధీనాయక్ …వరంగల్ బహిరంగ సభకు తన స్వగ్రామం నుంచి పాదయాత్ర తో వచ్చారు. ఐదుగురి టీంతో 70 కిలోమీటర్లు నడిచి వచ్చి అందరీ దృష్టిని ఆకర్షించారు. ఉద్యమ సమయం నుంచి చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న గాంధీనాయక్ కు దక్కాల్సిన గౌరవం దక్కిందని టీఆర్ఎస్ నేతలు , కార్యకర్తలు అంటున్నారు.