కేంద్ర గిరిజన మంత్రిపై ప్రివిలేజ్ నోటీసు జారీ చేసిన టీఆర్ఎస్ - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్ర గిరిజన మంత్రిపై ప్రివిలేజ్ నోటీసు జారీ చేసిన టీఆర్ఎస్

March 23, 2022

15

తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన రిజర్వేషన్ల అంశంపై పార్లమెంటుకు అబద్ధాలు చెప్పిన కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడుకు టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసులు జారీ చేశారు. ఆయనను తక్షణమే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, గతంలో గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే బిశ్వేశ్వర్ తుడు కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదన రాలేదని ప్రకటించారు. దీంతో నోటీసులు జారీ చేసిన టీఆర్ఎస్.. పార్లమెంటులో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గిరిజనులకు, తెలంగాణకు కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు.