హుజూర్‌నగర్ ప్రజలకు ధన్యవాదాలు..కవిత - MicTv.in - Telugu News
mictv telugu

హుజూర్‌నగర్ ప్రజలకు ధన్యవాదాలు..కవిత

October 24, 2019

హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ తరపున బరిలోకి దిగిన శానంపూడి సైదిరెడ్డిపై దాదాపు 43 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ కంచుకోట అయిన హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ ఖాతా తెరిచింది. 

ఈ విజయంపై ఆ పార్టీ నేత, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. సీఎం కేసీఆర్‌పై అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించిన, టీఆర్ఎస్‌కు అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్ నగర్ ప్రజలకు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ విజయం కోసం నిరంతరం పాటుపడ్డ టీఆర్ఎస్ కుటుంబసభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.