Trs leader ktr advice party leaders not to talk on mlas horse trading
mictv telugu

ఎమ్మెల్యేల కొనుగోలుపై టీఆర్ఎస్ నేతలు మాట్లాడకూడదు.. కేటీఆర్

October 27, 2022

Trs leader ktr advice party leaders not to talk on mlas horse trading

కలకలం సృష్టించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుల పథకం, వాళ్లు ఆశ చూపిన డబ్బు వివరాలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవరు అనే విషయాలపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించం లేదు. బీజేపీ నీచ రాజకీయాలకు ఇది ఉదాహరణ అని టీఆర్ఎస్ అంటుంటే, కేసీఆరే ఈ డ్రామా నడిపనించాడని బీజేపీ నేతలు అంటున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు ఇంకా కేసీఆర్ చెంత ప్రగతి భవన్‌లోనే ఉంటూ మీడియాకు అందుబాటులో లేకోవడంతో దీనిపై స్పష్టం రావడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు తిట్టిపోసుకుంటున్నారు. అయితే పూర్తి వివరాలు బయటికొచ్చేవరకు ఈ విషయంలో బయటికి మాట్లాడకూడదని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సూచించారు.

‘‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్ఞప్తి అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని ఆయన ట్వీట్ చేశారు.