సీట్లు పంచుకునేలోపు స్వీట్లు పంచుకుంటాం.. కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

సీట్లు పంచుకునేలోపు స్వీట్లు పంచుకుంటాం.. కేటీఆర్

October 23, 2018

తెలంగాణ విపక్ష మహాకూటమిలో ఎంతకూ తెగని సీట్ల పంపకం విమర్శలకు దారితీస్తోంది. మిత్రపక్షాలే కాకుండా అధికార పక్షం కూడా దీన్ని అవకాశంగా వాడుకుంటోంది. అడ్డగోలు కూటమి అధికారంలోకి వస్తే రైతులకు కన్నీళ్లే మిగులుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మహాకూటమి పార్టీలు సీట్లు పచుకోనేలోపు తాము స్వీట్లను పంచుకుంటామని గెలుపుపై ధీమాతో అన్నారు.

TRS leader and minister KTR attacked opposition Mahakutami seat sharing logjam and they share sweets before seat sharing

ఆయన ఈ రోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బొంగులూరులో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ‘రాష్ట్ర ప్రజలు 60 ఏళ్లుగా పడిన ఇబ్బందులు మహాకూటమిని గెలిపిస్తే మళ్లీ వస్తాయి. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం.. మహాకూటమిలో పొత్తులు, సీట్ల అంశం ఇప్పట్లో ఓ కొలిక్కి రాదు.. వాళ్లు సీట్లు పంచుకునేలోపు మనం స్వీట్లు పంచుకుంటాం.. మహాకూటమికి ఓటు వేస్తే టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలోకి అధికారం వెళ్తుంది.. అలా జరిగితే తెలంగాణలో ప్రాజెక్టులు నిలిచిపోతాయి..నెలకో ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తాడు’ అని హెచ్చరించారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఒక సింహం అని, సీల్డ్‌ కవర్‌ సీఎం కావాలా? సింహం లాంటి కేసీఆర్‌ కావాలా? అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ఎంతో కృషి చేసిందన్నారు.