TRS leader who kept the gun visible to all in huzurabad
mictv telugu

నిజమైన ఈటల తుపాకీ ఆరోపణ.. టీఆర్ఎస్ లీడర్‌ని హెచ్చరించిన కమిషనర్

September 15, 2022

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గమైన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పోలీసులు ఇష్టారాజ్యంగా గన్ లైసెన్సులు ఇస్తున్నారని ఆరోపించారు. తనకేదైనా అయితే కేసీఆర్‌దే బాధ్యత అని చెప్పడం తెలిసిందే. అయితే ఆయన ఊరికే ఆరోపణ చేయలేదని తాజాగా తెలుస్తోంది. ఈటల రాజేందర్ నియోజకవర్గానికి చెందిన ఓ టీఆర్ఎస్ నాయకుడు తుపాకీ ప్యాంటు జేబులో పెట్టుకుని ప్రజలందరికీ కనిపించేలా బహిరంగంగా తిరుగుతున్నారు. గన్ కనిపించేలా పెట్టుకున్న సదరు నాయకుడు ఓ ఎంపీపీ భర్త కావడం గమనార్హం. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నెటిజన్లు షేర్ చేస్తున్నారు. దీంతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ స్పందించారు. హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. ఈటల ఆరోపణ అవాస్తవమని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు లైసెన్స్ ఇవ్వట్లేదని, గత రెండేళ్లలో కేవలం ఇద్దరికి మాత్రమే లైసెన్స్ ఇచ్చామని వెల్లడించారు. అలాగే తన తుపాకీని అందరికీ కనిపించేలా పెట్టుకుని తిరుగుతున్న నాయకుడిని హెచ్చరించామని, మరోసారి ఇలా చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేసినట్టు వివరించారు.