కొత్తగా రాష్ట్రపతి పదవీ భాద్యతలు చేపట్టిన రామ్ నాథ్ కోవింద్ ను తెలంగాణ గులాబీ నేతలు ఢిల్లీలో కలిసారు. సీఎం వెంట టీఆర్ఎస్ ఎంపీలు,ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి,మంత్రి జగదీష్ రెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ర్టపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు తెలిపినందుకు సీఎం కేసీఆర్ కు రామ్ నాథ్ కృతజ్ఞతలు తెలిపారు..
ఈ సందర్భంగా రాష్ర్ట ప్రగతి,అభివృద్ధిపై రాష్ర్టపతి రామ్ నాథ్ కు కెసీఆర్ వివరించారు.భూగర్భ జలాలు పెరిగేలా..ఇంటింటికి మంచినీరు అందించేలా మిషన్ కాకతీయ మిషన్ భగీరథ చేపట్టినట్లు సీఎం రాష్ట్రపతికి వివరించారట.రాష్ట్రంలో ఉన్న పలు సమస్యలపై కేంద్ర మంత్రులను కలిసిన కెసీఆర్ గురువారం సాయంత్రం వరకు తిరిగి హైద్రాబాద్ కు రానున్నారని సమాచారం.