trs legislative party meeting on 3rd september
mictv telugu

సెప్టెంబర్‌ 3న టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం.. సీఎం నిర్ణయం

August 30, 2022

సెప్టెంబర్ 3న తెలంగాణ క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ క్యాబినెట్‌ మీటింగ్‌ తరువాత తెలంగాణ భవన్‌లో సాయంత్రం 5 గంటలకు టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ (టీఆర్‌ఎస్‌ఎల్పీ) సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించినట్లు పార్టీ శ్రేణుల వెల్లడించాయి. సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఈ భేటీకి ఎంపీలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, పింఛన్లు, గిరిజనుల పోడు భూములు, ప్రస్తుత రాజకీయ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

వీటితో పాటు ఇతర పాలనాపరమైన అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. బడ్జెట్ సమావేశాలు మార్చి 15న ముగిశాయి. దీంతో సెప్టెంబర్ 14వ తేదీలోపు సభ మళ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే శాసనసభ సమావేశాల నిర్వహణపై కేబినెట్ ఓ నిర్ణయానికి రానుంది. మరోవైపు ఈనెల 31న బిహార్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన చేయనున్నారు. గాల్వాన్ లోయల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు, సికింద్రాబాద్ టింబర్ డిపోలో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించనున్నారు.