మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ వాహనం బోల్తా.. ఇరువురి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ వాహనం బోల్తా.. ఇరువురి మృతి

November 24, 2019

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌లోని కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పిన బుల్లెట్ ఫ్రూఫ్ కారు బోల్తాపడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ జిల్లా చీటూరు గ్రామం వద్ద అర్థరాత్రి జరిగింది. దయాకర్ రావు తన సొంత నియోజకవర్గం పాలకుర్తికి హైదరాబాద్ నుంచి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

TRS Minister.

మంత్రి కాన్వాయ్‌లో వెనక వస్తున్న కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ పార్థసారధి, సోషల్ మీడియా ఇంచార్జీ పూర్ణ మరణించగా గన్‌మెన్ నరేశ్, శివ, అటెండర్ తాతారావులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన వారిని మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పరామర్శించారు. బాధితుల కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.