పాక్ నుంచి వచ్చినా పంపించం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే  - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ నుంచి వచ్చినా పంపించం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే 

February 27, 2020

TRS MLA.

దేశంలోని ఇతర ప్రాంతాల నుంచే కాదు, పాకిస్తాన్ నుంచి వచ్చినవారినైనా సరే తెలంగాణ నుంచి పంపించే ప్రసక్తే లేదని శేరిలింగంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తెలంగాణలో సీఏఏ అమలు కాదని అరికెపూడి గాంధీ స్పష్టంచేశారు.

శేరిలింగంపల్లిలో గురువారం మైనార్టీ సంఘాల వారు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలోనే కాదు, పాకిస్తాన్ నుంచి వచ్చినా సరే ఇక్కడి నుంచి పంపించే వారెవరూ లేరు. ఒకవేళ అలా పంపించాల్సి వస్తే నేను కూడా మీతో వస్తాను. కొందరు బీజేపీ నేతలు మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని మరీ, అక్కడ సీఏఏ ఏజెంట్ల మాదిరిగా పనిచేస్తున్నారు. తప్పుడు మాటలతో జనం మధ్యకు వచ్చే ఇలాంటి బీజేపీ నాయకులపై తిరగబడాలి. అవసరమైతే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి బహిరంగ సభ కూడా నిర్వహిస్తాం’ అని అరికెపూడి గాంధీ అన్నారు.