టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి

February 16, 2020

Trs

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. అమ్రాబాద్ మండలం సహకార ఎన్నికల్లో ఘర్షణ జరిగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో బాలరాజు కుడికంటికి గాయమైనది. రెండు పార్టీల కొట్లాటలో బ్యాలెట్ పత్రాలు కూడా గల్లంతు అయ్యాయి. దీంతో ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. ఇరు పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, వారిని చెదరగొట్టారు.

అమ్రాబాద్ మండలంలో మొత్తం 13 ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ కూడా పూర్తి అయింది. ఏడుగురు కాంగ్రెస్‌ సభ్యులు, ఆరుగురు టీఆర్ఎస్ సభ్యులు విజయం సాధించారు. ఆదివారం చైర్మన్ ఎన్నిక స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా అక్కడికి వచ్చారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తమ సభ్యులను తీసుకెళ్తారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.