ఎన్‌కౌంటర్ బాధించింది..టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీత - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్‌కౌంటర్ బాధించింది..టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీత

December 10, 2019

sunita 02

దిశా నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి తెల్సిందే. ఎన్‌కౌంటర్‌‌పై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు పోలీసుల చర్యను సమర్దిస్తుంటే.. పలు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు, నిందితుల బంధువులు మాత్రం ఎన్‌కౌంటర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతా.. దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ గురించి సంచలనం వ్యాఖ్యలు చేశారు. దిశా మృతి బాధాకరమే అలాగే దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కూడా బాధాకరమే అని వ్యాఖ్యానించారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన యువకుల తల్లిదండ్రులు ఎంతో బాధపడి ఉంటారని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆలేరులో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.