వేములవాడ ఎమ్మెల్యే పౌరసత్వం రద్దు...! - MicTv.in - Telugu News
mictv telugu

వేములవాడ ఎమ్మెల్యే పౌరసత్వం రద్దు…!

September 6, 2017

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉన్నదని తేలడంతో  భారత పౌరసత్వం చెల్లదని  దాన్ని రద్దు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నమనేని రమేష్‌ టీఆర్‌ఎస్‌ తరపున వేములవాడ ఎమ్మేల్యేగా గెలిచారు. అయితే ఆయనపై పోటీ చేసి  ఓడిపోయిన ఆది శ్రీనివాస్..రమేష్ పౌరసత్వాన్ని సవాలు చేశారు. రమేశ్ కు భారత పౌరసత్వం లేనందున ఎన్నికల్లో పోటీకి అనర్హుడని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించి భారత పౌరసత్వం పొందారని, వెంటనే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.  కేంద్ర హోంశాఖ నిర్ణయాన్ని సవాల్‌ చేసే యోచనలో చెన్నమనేని ఉన్నట్లు సమాచారం. ఇటీవల సుప్రీంకోర్టులో చెన్నమనేని పౌరసత్వం కేసు విచారణకు వచ్చింది. ఆరు నెలల్లో నిర్ణయం ప్రకటించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తనను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేని శక్తులు, పౌరసత్వాన్ని వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందడానికి దొంగదెబ్బ తీశారని వివరించారు. తనకు అవకాశం ఉన్నంత కాలం ప్రజలకు, మాతృభూమికి సేవ చేస్తానని చెన్నమనేని రమేశ్ అన్నారు.