సంక్రాంతి సంబరాల్లో ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ - MicTv.in - Telugu News
mictv telugu

సంక్రాంతి సంబరాల్లో ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

January 16, 2020

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రజలంతా సొంత ఊళ్లకు వెళ్లి బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడిపారు. ప్రజా ప్రతినిధులు కూడా తమ నియోజకవర్గాల్లో వేడుకల్లో పాల్గొన్నారు. అటు సంగారెడ్డి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆందోల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొని సందడి చేశారు. తన నియోజకవర్గ నేతలు, అనుచరులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాలిపటాలు ఎగురవేసి ఉత్సాహంగా కనిపించారు. ఈ సంక్రాంతి ప్రజలకు సుఖ సంతోషాలను కలిగించాలని ఆకాంక్షించారు. పండగ సంబరాల్లో భాగంగా ప్రజలను కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో కలిసి పండగ జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. 

సంక్రాంతి సంబరాల్లో ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

Publiée par Satyavathi Satya sur Mercredi 15 janvier 2020