నిరూపిస్తే స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటా - టీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్ - MicTv.in - Telugu News
mictv telugu

నిరూపిస్తే స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటా – టీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్

March 24, 2022

టీఆర్ఎస్

పటాన్ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో గజం భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే, పోలీస్ స్టేషన్ ముందు విషం తాగి ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు నందీశ్వర్ గౌడ్ తనపై అభాండాలు వేయడం మానుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టాలని సవాల్ విసిరారు. నందీశ్వర్ గౌడ్ ఎంపీపీగా, ఎమ్మెల్యేగా ఉన్పప్పుడు చేసిన పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తనపై ఉన్న కేసును సుప్రీం కోర్టు ఆదేశాలతో హైకోర్టు ఎప్పుడో కొట్టివేసిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో నందీశ్వర్ గౌడ్ మీద సాధారణ టీఆర్ఎస్ కార్యకర్తను నిలబెట్టి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి కొంతకాలంగా భూ యజమానులను, స్థానికులను బెదిరించి 10 వేల కోట్ల విలువైన భూములను లాక్కున్నారని నందీశ్వర్ గౌడ్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో మహిపాల్ రెడ్డి పై విధంగా స్పందించారు.