టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా.. మిర్యాలగూడలో కలకలం - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా.. మిర్యాలగూడలో కలకలం

July 16, 2020

TRS Mla Suffer With Corona

తెలంగాణలోప్రజా ప్రతినిధులను కరోనా వదలడం లేదు. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు వైరస్ బారిన పడి కోలుకున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా నిర్థారణ అయ్యింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు వైరస్ బారిన పడినట్టు వైద్యులు తేల్చారు. వెంటనే అతన్ని హోం క్వారంటైన్ చేశారు. స్వల్ప లక్షణాలతో ఆయన ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. 

రెండు రోజుల నుంచి భాస్కరరావు జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడుతున్నారు. కరోనా అనుమానంతో పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది.ప్రస్తుతం ఆయన మిర్యాలగూడలోని తన ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల పలు అభివృద్ధి కార్యక్రమాలు, కార్యకర్తలను కూడా కలిశారు. దీంతో అతనితో సన్నిహితంగా ఉన్నవారిని అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యేకు కరోనా అని తేలిసి అనుచరులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఇప్పటికే హైదరాబాద్‌ పరివాహక ప్రాంతాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న వైద్య సిబ్బంది, పోలీసులు, ప్రజా ప్రతినిధులు వ్యాధిబారిన పడుతుంటం ఆందోళన కలిగిస్తోంది.