Trs mlas famhouse case
mictv telugu

సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఫాంహౌస్ నిందితులు

November 1, 2022

Trs mlas famhouse case

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమను అరెస్ట్ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. దీనిపై మంగళవారం పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం శుక్రవారం లిస్ట్ చేయాలని ఆదేశించింది. ఈ కేసులో నిందితులు 14 రోజుల రిమాండ్ నిమిత్తం చంచల్ గూడ జైల్లో ఉన్నారు..ఈ రిమాండ్ ను కొట్టివేయాలని నిందితుల తరఫు న్యాయవాది ఏసీబీ కోర్టును ఆశ్రయించగా దానిని న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు..

ఈ నెల 26న మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపింది.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావులు పార్టీ మారితే రూ.100 కోట్లు ఇస్తామని జరిపిన చర్చలు చర్చనీయాంశమయ్యాయి.. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్ట్ చేసారు. హైకోర్టు ఆదేశాలతో 14 రోజులు రిమాండ్‌కు తరలించారు ఇక ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతునే ఉంది. ఈ అంశం ఢిల్లీ పీఠాలను కదిలిస్తోందని కేసీఆర్ చెప్పడంపై సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది.