Trs mlas faram house deal nandakumar Bharati audio leak
mictv telugu

ఫామ్‌హౌజ్ ఆడియో లీక్.. నందు, పైలట్, భారతి ముచ్చట్లు ఇవీ

October 28, 2022

తెలంగాణలో కలకలం రేపుతున్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ ఆధారాలు బయటికొస్తున్నాయి. నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్.. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో మాట్లాడుతున్న ఆడియో వెలుగుచూసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ఎక్కడ, ఎలా నడపాలన్నదానిపై నిందితులు చర్చించారు.. నంబర్ 1, నంబర్ 2 అని, హైదరాబాద్ మంచి ప్లేస్, భయం ఉందని, సులభంగా అయిపోతుందని అని చెప్పుకున్నారు. హిందీ, ఇంగ్లీషులో మాట్లాడుకున్నారు.

ఆడియోలో ఉన్న ప్రకారం.. నందకుమార్ ఈ ప్రపోజల్ తెచ్చారని, హైదరాబాద్ మంచి ప్లేస్ అని, మిగతా ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని రోహిత్ చెప్పారు. ‘నందు రేపు రేపు అంటున్నారు. కంగారు లేదు,’ అని చెప్పారు. ‘ఎవరెవరు వస్తారో చెప్పండి’ అని భారతి కోరారు. ఈ విషయంలో భయపడాల్సిన అవసరమేమీ లేదని భరోసా ఇచ్చారు. కేంద్రం నుంచి పూర్తి రక్షణ ఉంటుందని చెప్పారు. ‘ఈడీ, ఇంకమ్ ట్యాక్స్ వంటివాటితో సమసయలు ఉండదు’ అని హామీ ఇచ్చారు. రోహిత్‌కు చెందిన ఫామ్ హౌజులో ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ కు సంబంధించి భారతి, నందకుమార్, సింహయాజీలను పోలీసులు అరెస్ట్ చేయడం, ఆధారాల్లేవంటూ కోర్టు వారిని వదిలేయడం తెలిసిందే.