Trs mlas purchase deal who is B L Santhosh quoted by Ramachandra Bharati
mictv telugu

ఫామ్‌హౌజ్ కేసు.. ఆ బీఎల్ సంతోష్ ఎవరు?

October 28, 2022

Trs mlas purchase deal who is B L Santhosh  quoted by Ramachandra Bharati

టీఆర్ఎస్ ఎమ్యెల్యేల కొనుగోలు కుట్రకు సంబంధించిన ఆడియో కాల్ లీక్ అయింది. సంచలనంగా మారిన ఈ ఆడియోలో టీఆర్ఎస్ ఎమ్యెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని బీజేపీలోకి రమ్మంటూ స్వామిజీ రామచంద్రం భారతి ప్రలోభపెడుతున్నట్టు స్పష్టంగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ విషయంలో ఎదురుదాడి చేస్తూ వస్తున్న బీజేపీ ఈ ఆడియోతో ఇరుకున పడినట్టే అయింది. బీజేపీలో నంబర్1, నంబర్2లకు మీ విషయం చెప్తానని.. దైర్యంగా బీజేపీకి రావాలని, మరికొందరిని కూడా బీజేపీ పార్టీలోకి లాగాలని.. ఈడీ, ఐటీ దాడులు జరగకుండా నేను చూసుకుంటా అని ఈ ఆడియోలో స్పష్టంగా రికార్డు అయింది.

ఇక ఇందులో రామచంద్రభారతి కొన్నిసార్లు.. ‘బీఎల్ సంతోష్’ అనే వ్యక్తి పేరును ప్రస్తావించాడు. బీజేపీలో టాప్ పొజిషన్‌లో ఉన్న ఈయన ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏమి? అని ఆసక్తి రేగుతోంది. ‘మా ఆర్గనైజింగ్ సెక్రెటరీ బీఎల్ సంతోష్ అంతా చూసుకుంటారు’ అని రామచంద్రభారతి రోహిత్ రెడ్డితో పదేపదే చెప్పారు. ఇంతకూ ఎవరా బీఎల్ సంతోష్? అతనికి ఎమ్మెల్యేలో బేరసారాలు నడిపేంత సీనుందా?

ఆతని పూర్తిపేరు బొమ్మరబెట్టు లక్ష్మీజనార్ధన సంతోష్. కర్ణాటక బీజేపీ శాఖకు ఎనిమిదేళ్లు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈయన్ను 2014లో అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌గా, జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సంతోష్ స్వస్థలం ఉడిపి. దావణగెరెలోని BDT కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీని చదివారు. సంతోష్ 1993లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా పనిచేశారు. బీజేపీ నాయకుల దగ్గర ఆయనకు బాగా చనువుందని, బేరసారాల్లో దిట్ట అని చెబుతుంటారు. ఆడియో లీకేజీ నేపథ్యంలో పోలీసులు సంతోష్‌ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశముంది.