Trs mlc kalvakuntla Kavita on kcr national politics
mictv telugu

తెలంగాణ తెచ్చిన కేసీఆర్, దేశాన్నీ మారుస్తారు.. కవిత

July 13, 2022

Trs mlc kalvakuntla Kavita on kcr national politics

తెలంగాణ గత ఎనిమిదేళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని టీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్లుగానే దేశంలో సైతం మార్పు తీసుకొస్తారని, అది ఆయన వల్లే సాధ్యమని ఆమె పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్‌ సాగర్‌ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమె ప్రసంగించారు.

‘‘కష్టపడి పని చేసేవారికి తగిన గుర్తింపు తప్పకుండా వస్తుందనడానికి ఇదే రుజువు. రాజీవ్ సాగర్‌కి వచ్చిన గుర్తింపు జాగృతి కార్యకర్తలకు, తెలంగాణ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొన్న యువ మిత్రులకు వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నాం. రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్న కేసీఆర్‌ కొందరు ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నారు. నెత్తిమీద రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా అమ్ముడుబోని వాళ్లు అవాకులు, చెవాకులు పేలుతున్నారు. కొన్ని పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని, అలాంటి వారిని ఎదుర్కోవడం కేసీఆర్ గారితోనే సాధ్యం’ అని కవిత అన్నారు. ఈ కార్యక్రమానికి త్రులు సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి , ప్రశాంత్ రెడ్డి , మహమూద్ అలి , తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.