నవ్వేం చేశావ్, ఇవన్నీ నేనున్నప్పుడు వచ్చినవే.. కవిత ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

నవ్వేం చేశావ్, ఇవన్నీ నేనున్నప్పుడు వచ్చినవే.. కవిత ఫైర్

May 4, 2022

సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై బుధవారం మండిపడ్డారు. ప్రజా తీర్పును గౌరవించి మూడేళ్ల సమయమిచ్చామని, ఇంక ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ఆమె స్థానిక మీడియాతో రాజకీయాల గురించి మాట్లాడారు. ‘మూడేళ్లు విమర్శలు చేయకుండా ఉన్నాం. ఈ కాలంలో అర్వింద్ ప్రజలకు చేసిందేమీ లేదు. పసుపు బోర్డు ప్రాంతీయ కార్యాలయంతో పాటు ఇతర సౌకర్యాలన్నీ నేను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి వచ్చినవే. ప్రజలు ఈ వాస్తవాన్ని గ్రహించాలి. మంచి సేవ చేసేవాళ్లను గుర్తించాలని కోరుతున్నా’నని వ్యాఖ్యానించారు. అలాగే రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. ‘ఏం చేశారని తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో తెలంగాణ రైతులకు అనుకూలంగా పార్లమెంటులో మాట్లాడాలని రాహుల్ గాంధీని కోరితే స్పందించలేదు. కేవలం రాజకీయాల కోసమే వరంగల్, హైదరాబాదుకు వస్తున్నారు. తెలంగాణకు మద్ధతివ్వని రాహుల్ గాంధీకి ఇక్కడ ఏం పని?’ అంటూ ప్రశ్నించారు.