TRS mlc l.ramana ill in ED investigation..
mictv telugu

ఈడీ విచారణలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి అస్వస్థత..

November 18, 2022

క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించిన పలువురు ప్రముఖలను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. శుక్రవారం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ ఈడీ విచారణకు హాజరయ్యారు. చికోటి ప్రవీణ్ నిర్వహించిన కేసినో ఈవెంట్లకు సంబంధించి ఆయనను విచారిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఇదే వ్యవహారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులతో పాటు వైసీపీ నేత గురునాథ్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసులో ఇప్పటికే 100 మందితో కూడిన జాబితాను ఈడీ సిద్ధం చేసింది.