TRS MLC Padi Kaushik Reddy once again made sensational comments.
mictv telugu

ఎమ్మెల్సీగా తృప్తి లేదు.. హుజురాబాద్ ఎమ్మెల్యే అయితా: కౌశిక్ రెడ్డి

November 18, 2022

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీగా తనకు తృప్తి లేదని… హుజురాబాద్ ఎమ్మెల్యే అయితేనే తృప్తి అని స్పష్టం చేశారు. కమలాపూర్‌లో తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా.. ‘‘మీరు ఏది అడిగితే అది ఇస్తున్న.. హుజురాబాద్ ప్రజలు ఆలోచన చేయండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్న. కేసీఆర్ నాకు టికెట్ ఇస్తారు’’ అంటూ కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు కౌశిక్ రెడ్డి. కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘కళ్యాణలక్ష్మి పైసలు వచ్ఛినయ్ రమ్మని చెప్పినా కొంతమంది రావడం లేదు. కేసీఆర్‌కు గర్జుండి డబ్బులు పంపిస్తున్నట్టుంది. రానివాళ్ల చెక్కులు క్యాన్సిల్ చేస్తా. అన్ని పథకాలు కావాలంటరు, మాకు మాత్రం ఓటెయ్యరు. మొన్న హుజూరాబాద్ ఎన్నికల్లో ఆయనకే ఓటెస్తిరి’’ అంటూ కౌశిక్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చివరకు కళ్యాణలక్ష్మి లబ్ధిదారులతో థాంక్యూ కేసీఆర్ అని చెప్పించారు. కాగా.. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.