నా కొడుకులు నా మాట ఇంటలేరు..! - MicTv.in - Telugu News
mictv telugu

నా కొడుకులు నా మాట ఇంటలేరు..!

August 18, 2017

డి. శ్రీనివాస్ ఉరఫ్ డీఎస్ తెలుగు రాష్రాల రాజకీయాల్లో ఈ పేరు అందరికి సుపరిచితం. కాంగ్రెస్ పార్టీనీ రెండు సార్లు అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర అందరికీ తెలిసిందే. 2004, 2009 ఎన్నికల సందర్భంగా పీసీసీ అధ్యక్షుడిగా చేసిన చరిత్ర శ్రీనివాస్ ది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనకు తెలుసు. ఈక్రమంలో కేసీఆర్ తో ఉన్న సన్నిహిత్యంతో డీఎస్ కారెక్కేసారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చ. టీఆర్ ఎస్ తో జత కట్టడం, రాజ్యసభకు ఎన్నిక కావడం చూస్తుండగానే జరిగిపోయింది.

ఇంతవరకు సాఫీగానే డీఎస్ రాజకీయ జీవితం కొనసాగింది. ఎప్పుడు ఏదో పద్ధతుల్లో అధికారానికి దగ్గరగా ఉంటూనే వస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీనివాస్ కు అసలు సమస్య ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. అది ఇంట్లోనుండే ప్రారంభం కావడం ఇప్పుడు చర్చగా మారింది.

శ్రీనివాస్ కి ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి సంజయ్, చిన్నబ్బాయి అర్వింద్. సంజయ్ రాజకీయ ప్రవేశం జరిగిపోయి ఎందుకు పనికి రారని తేలిపోయింది. అయితే అర్వింద్ మాత్రం తన రాజకీయ ఎంట్రీ కోసం తహతహలాడుతున్నారు. అయితే తండ్రి బాటలో కాకుండా సపరేట్  లైన్లో పోవాలని అర్వింద్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది

మొన్న పంద్రాగస్ట్ నాడు నిజామాబాద్ లోకల్ అడిషన్లలో మోడీని కీర్తిస్తూ అర్వింద్ ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెర లేపినట్టైంది. ఆ తర్వాత కొన్ని టీవీ చానళ్లతో మాట్లాడుతూ.. మోడీ అంటే తనకు చిన్నప్పటినుండి ఇష్టమనీ, ఆయన బాటలో నడవడం తప్ప, రాజకీయాల్లో వేరే ప్రత్యామ్నాయం లేదని అర్వింద్ స్పష్టం చేశాడు.

తాను చేస్తున్న మోడీ భజనకు, తన తండ్రికి ఎలాంటి సంబంధవ లేదని, ఎవరి రాజకీయాలె వాళ్లవనీ కుండ బద్దలు కొట్టాడు. ఈక్రమంలో డి.శ్రీనివాస్ కూడా బీజేపీలోకి చేరుతున్నట్టు భారీగా కథనాలు వినిపించాయి.

అసలు విషయానికస్తే శ్రీనివాస్ మనోగతం మరోలా ఉంది. తాను పుట్టి పెరిగింది కాంగ్రెస్ లోనేననీ, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల టీఆర్ఎస్ లో చేరాల్సి వచ్చిందనీ, చివరి వరకు తాను బీజేపీకి వ్యతిరేకంగానే పనిచేస్తానని.. ఆంత రింగుకుల దగ్గర శ్రీనివాస్ వాపోతున్నట్టు తెలుస్తోంది

ఎంతవద్దన్నా తన కొడుకు అర్వింద్ బీజేపీ భజన మానడంలేదని,  తన మాట వినకుండా కాషాయ దళంలో చేరడానికి సిద్థమవుతున్నాడని డీఎస్ తన సన్నిహితులతో అన్నట్టు సమాచారం. మరోవైపు  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అర్వింద్ వ్యవహారంపై  శ్రీనివాస్ నుండి సమాధానం కోరినట్టు పార్టీ పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

కేసీఆర్ దగ్గరకూడా డిఎస్ తన మనసులో మాటను బయటపెట్టినట్టు తెలుస్తుంది.తాను ఎట్టిపరిస్ధితుల్లో టిఆర్ ఎస్ ను వదిలేది లేదని కేసీఆర్ తో చెప్పినట్టు వినికిడి.అయితే  టిఆర్ ఎస్ లేకపోతే కాంగ్రెస్ అంతేగానీ బిజెపీలో తాను మాత్రం చేరే ప్రసక్తే లేదని కేసీఆర్ తో డిఎస్ అన్నట్టు తెలుస్తుంది.

తండ్రి టిఆర్ ఎస్ ,కొడుకు బిజెపి ఒకే ఇంటినుంచి రాజకీయాలు నడపడం సాధ్యపడుతుందో లేదో కాలమే తేల్చాలి.