ఆంధ్రాకు జైకొట్టిన కవిత! - MicTv.in - Telugu News
mictv telugu

ఆంధ్రాకు జైకొట్టిన కవిత!

February 8, 2018

పార్లమెంటులో కొన్ని రోజులుగా ఏపీ ఎంపీలు పార్టీలకు అతీతంగా యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్లో తమకు ఘోర అన్యాయం చేశారని, విభజన చట్టం కింద ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపతున్నారు. వెల్ లోకి దూసుకెళ్లి, నేలపైన పడుకుని, శంఖాలు ఊది.. నానా రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

వీరికి టీఆర్ఎస్ ఎంపీ కవిత కూడా మద్దతు పలికారు. గురువారం ఆమె లోక్‌సభలో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ కేంద్ర ప్రభుత్వం జాప్యం లేకుండా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎంపీల డిమాండ్లలో న్యాయం ఉందని, వారికి తాను మద్దతిస్తున్నానని అన్నారు.
10 నిమిషాల పాటు కవిత విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. చివరిగా ‘జై ఆంధ్రా’ అని నినదిస్తూ ప్రసంగాన్ని ముగించారు. పలువురు తెలంగాణ ఎంపీలు కూడా ఏపీ ఎంపీలకు బాసటగా నిలుస్తున్నారు. బుధవారం మరో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా వారి తరఫున మాట్లాడారు.