ఒంటేరు ప్రతాపరెడ్డిని ఎన్‌కౌంటర్ చేసే అవసరం లేదు - MicTv.in - Telugu News
mictv telugu

ఒంటేరు ప్రతాపరెడ్డిని ఎన్‌కౌంటర్ చేసే అవసరం లేదు

January 30, 2018

తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేస్తోంటే విపక్షాలు మాత్రం కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నాయని టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆరోపించారు. ఇలాంటి విపక్షాలు రాష్ట్ర దురదృష్టమన్నారు. టీడీపీ నేత ఓంటేరు ప్రతాపరెడ్డిని ఎన్‌కౌంటర్ చేసే అవసరం సీఎం కేసీఆర్‌కు లేదన్నారు. ఆమె మంగళవారం సచివాలయం వద్ద విలేకర్లతో మాట్లాడారు.

ప్రతిపక్షాల దురాలోచన వల్లే సింగరేణి డిపెండెంట్ నియామకాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. కార్మికులు వీలైనంత త్వరలో న్యాయం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, వార్ వన్ సైడే అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ నుంచి ఇకముందు పలువురు నేతలు తమ పార్టీలో చేరతారని వెల్లడించారు. కేబినెట్‌లో మహిళలు లేరన్న విషయం ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపదన్నారు.

గతంలో రాష్ట్రంలో ఆరుగురు మహిళా మంత్రులు చేయలేని పనులను కేసీఆర్ ఒక్కరే చేశారన్నారు. పరుష పదజాలం వాడేవారిని కఠినంగా శిక్షించాలన్న చట్టసవరణపై స్పందిస్తూ.. సాధారణ చట్ట సవరణ ప్రక్రియలో భాగంగా అలా చేశానన్నారు. తాజాగా ప్రకటించిన పద్మ వార్డుల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.