ఎంపి గుత్తా రాజీనామా... టిఆర్ఎస్ ప్లాన్ ఏమిటో తెలుసా... - MicTv.in - Telugu News
mictv telugu

ఎంపి గుత్తా రాజీనామా… టిఆర్ఎస్ ప్లాన్ ఏమిటో తెలుసా…

September 12, 2017

తెలంగాణలో మరో నంద్యాల లాంటి రిజల్ట్ కోసం అధికార పార్టీ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబందించి ఓ ఎంపి తన పదవికి రాజీనామా చేసే యోచనలో  ఉన్నారట. రాష్ట్ర రైతు సమన్వయ సమితి కన్వీనర్ గా  గుత్తాసుఖేందర్ రెడ్డికి క్యాబెటినె హోదా ఇచ్చేందు కోసం ఈ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. నల్గొండ ఎంపిగా ఉన్న సుఖేందర్ రెడ్డికి పదవి ఇవ్వాలంటే ఈ ఎంపిక పోస్టు అడ్డుం వస్తున్నదట.  వారం పది రోజుల్లో సుఖేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడం ఖాయమని అంటున్నారు.

దాంతో పాటు నంద్యాల ఉప ఎన్నికలను అక్కడి అధికార పార్టీ  సాధారణ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్ గా భావించి జనం నాడీ తెలుసుకున్నది. ఇక్కడా అదే ప్లాన్ చేయాలని ఇక్కడి పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. దీనికి కేసీఆర్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. దాంతో పాటు మరో ఎంఎల్యే స్థానానికి కూడా ఉప ఎన్నిక జరుగుతుందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ బలం ఎంతో, బలహీనత ఏమిటో కూడా తెలుసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని పార్టీ నాయకులు కూడా  అనుకుంటున్నారట.

తెలంగాణలో అధికార పార్టీకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఈ ఎన్నికల్లో  మంచి మెజార్టీ గనుక వస్తే ఇక  టిఆర్ఎస్ కు తిరుగే ఉండుదు. పైగా తన పాలను తీరును చెక్ చేసుకోవడానికి మంచి అవకాశంగా పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు  కూడా తెలుస్తున్నది. గుత్తా సుఖేందర్ రెడ్డికి క్యాబినెట్ హోదా ఇవ్వడంతోపాటు…. పార్టీ బలాన్ని కూడా చెక్ చేసుకోవచ్చని అనుకుంటున్నారట.