TRS Next Target Etela Rajender..?
mictv telugu

టీఆర్ఎస్ నెక్ట్స్ టార్గెట్ ఈటల రాజేందర్‌యేనా?

October 21, 2022

TRS Next Target Etela Rajender..?

తెలంగాణలో పాలిటిక్స్ హీటెక్కాయి. జంపింగ్ జపాంగ్ తో బిగ్ ట్విస్టులు మొదలయ్యాయి.జోరుమీదున్న బీజేపీకి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి.టీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరిన కీలక నేతలు యూటర్న్ తీసుకుంటున్నారు. కొన్నినెలలకే తెలంగాణభవన్ డోర్స్ తడుతున్నారు. గురువారం భిక్షమయ్య గౌడ్ శుక్రవారం దాసోజు శ్రవణ్..శనివారం ఇంకొకరు అంటూ బీజేపీకి బైబై చెబుతూ నేతలు కారెక్కుతున్నారు. కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ ఈటల రాజేందరేనా?గులాబీ గూటికి చేరుకుంటారా?తెలంగాణ రాజకీయం ఎలా మలుపు తిరగబోతోంది?

ఆపరేషన్ ఆకర్ష్ గులాబీ

మునుగోడు ఉప ఎన్నికవేళ టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ వల విసిరింది. ఎత్తుకుపైఎత్తులు వేస్తూ బీజేపీకి ఝలక్ ఇస్తుంది. టీఆర్ఎస్ మాజీల్ని మళ్లీ పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఆపరేషన్ గులాబీ కోసం నేరుగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మాజీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. కీలక నేతలతోనే కేసీఆర్ మాట్లాడుతున్నట్టు టాక్. మిగతా నాయకులతో కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే భిక్షమయ్య గౌడ్ తో మొదలైన వలసల పర్వం దాసోజు శ్రవణ్ మీదుగా సాగుతోంది. బీజేపీ పై విమర్శ అస్త్రాల్ని సంధించిన దాసోజు శ్రవణ్ కారెక్కారు. అటు స్వామిగౌడ్ రేపోమాపో గులాబీ గూటికి చేరుతారు. కేసీఆర్ తో చర్చలు పూర్తయ్యాయి. ఇక జితేందర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డితో కూడా టీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు.అవసరమైతే సీఎం కేసీఆరే వీరితో మాట్లాడుతారని పార్టీలు వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పుడు మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసం జితేందర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి పనిచేస్తున్నారు.

TRS Next Target Etela Rajender..?

 

ఉద్యమ నేతల్ని రప్పించే ప్రయత్నాలు

తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన కీలక నాయకుల్ని తిరిగి టీఆర్ఎస్ లోకి రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉద్యమ నేతల్లో కొందరికి స్వయంగా కేసీఆర్ ఫోన్ చేశారని ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికలనాటికి టీఆర్ఎస్ ని వీడిన నాయకుల్ని వెనక్కి రప్పిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ లో చేరుతున్న నేతలకు కీలక బాధత్యలు అప్పగిస్తామని కేసీఆర్ హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లోకి వస్తారా?

ఆపరేషన్ ఆకర్ష గులాబీలో లాస్ట్ టార్గెట్ ఈటల రాజేందరే.ఇప్పటికే ఈటలతో వెళ్లిన నేతలకు రీ ఎంట్రీ కి టీఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ చేరుతారని తెలుస్తోంది. వీళ్లందరి తర్వాత ఈటలను సంప్రదించే అవకాశం లేకపోలేదు. టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందినా ఈటల రాజేందర్ చేరకపోవచ్చని టాక్.ఎందుకంటే సీఎం కేసీఆర్ తో ఉన్న ఇష్యూస్ కారణమని చెబుతున్నారు. 3 వందల కోట్ల ఎపిసోడ్ లో కేసీఆర్ హ్యాండిచ్చారని ఈటలను దగ్గర నుంచి చూసిన వాళ్లు చెబుతున్నారు. అప్పట్లో పార్టీని వీడే ముందు కూడా కేసీఆర్ ని కలిసేందుకు ఈటల రాజేందర్ విశ్వ ప్రయత్నాలు చేశారు. ప్రగత్ భవన్ గేటు దగ్గర ఆపేశారు. ఆ తర్వాత చేసేదిమిలేకనే బీజేపీలో చేరారు.

ఎవరైనా కేటీఆర్ సమక్షంలోనే…

బీజేపీ నుంచి చేరే నేతలంతా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకోవాలి. ఎవరికి కేసీఆర్ సమక్షంలో చేరే అవకాశం లేదు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత… బిందాస్ గా ఉన్న బీజేపీకి ఊహించని బిగ్ ట్విస్టులు కేసీఆర్ ఇస్తున్నారు.