సహకార కేంద్ర బ్యాంకుల ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్ఎస్ - MicTv.in - Telugu News
mictv telugu

సహకార కేంద్ర బ్యాంకుల ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్ఎస్

February 26, 2020

bcb

తెలంగాణ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్ధులే ఎక్కువ మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి జిల్లాల ప్రకారం 9 డీసీసీబీ, 9 డీసీఎంఎస్‌లు ఉన్నాయి. ఒక్కో బ్యాంకులో 20, సొసైటీలో 10 చొప్పున డైరెక్టర్‌ పదవులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 180 స్థానాలకు గాను 147 మంది, సొసైటీల్లో 90కి గాను 74 మంది ఏకగ్రీవం అయ్యారు. ఈనెల 29న ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. ఛైర్మన్‌, ఉపాధ్యక్ష అభ్యర్ధుల ఎంపికలో సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయం కానుంది. 29న జరిగే ఎన్నికలకు గంట ముందు అభ్యర్ధుల పేర్లను ఖరారు చేస్తారు.

కేవలం నల్లగొండ జిల్లాలో మాత్రం ఒకే ఒక్క డైరెక్టర్‌ స్థానం కాంగ్రెస్‌ పార్టీకి దక్కింది. కొన్ని రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులు లేక వాటికి నామినేషన్లు దాఖలుకాలేదు. వివిధ జిల్లాల్లో 33 రిజర్వుడ్‌ డైరెక్టర్‌ పదవులకు సభ్యులు లేక ఎవరూ నామినేషన్‌ వేయలేదు. అలాగే 9 డీసీఎంఎస్‌లలో 90 డైరెక్టర్‌ పదవులకు 16 నామినేషన్లు దాఖలు కాలేదు. రిజర్వుడ్‌ కేటగిరీలో ఎన్నిక జరగని 33 డీసీసీబీ డైరెక్టర్, 16 డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పదవులకు ఆరు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశముంది.