హరీష్ వ్యూహం..జగ్గారెడ్డి ‘చే’జారిన సంగారెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

హరీష్ వ్యూహం..జగ్గారెడ్డి ‘చే’జారిన సంగారెడ్డి

January 25, 2020

Trs party won in sangareddy municipal elections

తెలంగాణ మున్సిపల్‌ ఎ‍న్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్‌కు కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ సంచలన విజయాలను సాధిస్తోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డితో పాటు సదాశివపేట మున్సిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. అలాగే ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మొత్తం 14 మున్సిపాలిటీల్లో 13 చోట్ల టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. నారాయన్‌ఖేడ్‌ మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్‌ గెలుపొందింది.

సీఎం కేసీఆర్‌ సొంత జిల్లా మెదక్‌లో ఉన్న సంగారెడ్డిలో ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌కు మంచి ఫలితాలు రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గాన్ని గెలవాలని టీఆర్‌ఎస్‌ ఎంతో ప్రయత్నించింది. అయినా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి విజయం సాధించారు. దీంతో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో టీఆర్‌ఎస్‌ బరిలోకి దిగింది. దీనికి అనుగుణంగానే సీఎం కేసీఆర్‌ మంత్రి హరీష్‌ రావుకు సంగారెడ్డి, సదాశివపేట బాధ్యతలు అప్పగించారు. దీంతో హరీష్‌ మొదటి నుంచీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తూ.. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. ఎన్నికలకు ముందు హరీష్‌రావుపై జగ్గారెడ్డి అసభ్యకరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో జగ్గారెడ్డిపై సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.