TRS Party Working President KTR has tweeted to criticize Union Home Minister Amit Shah.
mictv telugu

అమిత్ షాకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

September 17, 2022

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చుర‌క‌లంటిస్తూ టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. 74 ఏండ్ల క్రితం నాటి కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఇండియ‌న్ యూనియ‌న్‌లో క‌లిపేందుకు వ‌చ్చారు. కానీ ఇవాళ‌నేమో ప్ర‌స్తుత కేంద్ర హోం మంత్రి తెలంగాణ ప్ర‌జ‌ల‌ను, రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని విభ‌జ‌న చేసేందుకు హైద‌రాబాద్‌కు వ‌చ్చార‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. దేశానికి కావాల్సింది విభ‌జ‌న రాజ‌కీయాలు కాదు.. నిర్ణ‌యాత్మ‌క రాజ‌కీయాలు కావాల‌ని తాను ప‌దే ప‌దే చెప్తున్నాన‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ లో బీజేపీ .. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ పరోక్షంగా అమిత్ షాను ఉద్దేశిస్తూ ఘాటుగా ట్వీట్ చేశారు. కాగా మంత్రి కేటీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.