కేసీఆర్ ప్రకటనతో సంబరాల్లో టీఆర్ఎస్ శ్రేణులు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ ప్రకటనతో సంబరాల్లో టీఆర్ఎస్ శ్రేణులు

March 9, 2022

000

ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి నిరుద్యోగ బంధు కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. పలు జిల్లాల్లో పార్టీ ఆఫీసుల వద్ద టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. కాగా, నిన్న వనపర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ నిరుద్యోగులనుద్దేశించి కీలక ప్రకటన చేస్తానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో నిన్న సాయంత్రం నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు అందుకు తగిన ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నారు. అటు తెలంగాణ భవన్‌కు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన రాగానే సంబరాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. కాగా, తెలంగాణలో 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరుగనుంది.