ఢిల్లీలో కేసీఆర్ హోర్డింగులు... - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీలో కేసీఆర్ హోర్డింగులు…

April 9, 2022

kcrj

వడ్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. ధాన్యం కొనుగోలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడానికి టీఆఎస్ పార్టీ ఆదివారం (ఈ నెల 11)న హస్తినలో భారీ నిరసన దీక్ష చేపనుంది. తమ డిమాండ్లను నగర ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి పార్టీ నగరంలో పలు చోట్ల కేసీఆర్ ఫొటోలతో హోర్డింగులు ఏర్పాటు చేసింది. ఢిల్లీ వాసులు వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. వీటిపై ‘ఒకే దేశం ఒకే ధాన్యం సేకరణ విధానం, రైతుల ప్రయోజనాలను కాపాడాలి’ వంటి నినాదాలు రాశారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను, ఇక్కడి రైతాంగం పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలను విమర్శించారు. ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం వేదిక‌గా జ‌రిగే ఈ నిర‌స‌న దీక్ష‌ చేపట్టనున్నారు.