TRS supported Martaret Alva in vice president election
mictv telugu

మార్టరెట్ అళ్వాకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్

August 5, 2022

శనివారం జరుగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విపక్షాల అభ్యర్ధి మార్గరెట్ ఆళ్వాకు మద్ధతు తెలపాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె. కేశవరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఆ పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు మార్గరెట్ ఆళ్వాకు ఓటు వేయనున్నారు. రహస్య బ్యాలెట్ విధానంలో జరిగే ఈ ఎన్నికల్లో మొత్తం 788 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికార బీజేపీ తరపున జగదీప్ ధన్‌కర్ పోటీలో ఉన్నారు. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే.