భూపతిరెడ్డి బిస్తర్ సర్దుకో..ఇది ఫైనల్ - MicTv.in - Telugu News
mictv telugu

భూపతిరెడ్డి బిస్తర్ సర్దుకో..ఇది ఫైనల్

December 13, 2017

భూపతిరెడ్డి వర్సెస్ బాజిరెడ్డి గొడవ క్లైమాక్స్ కు చేరింది. పాత నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కొన్ని రోజుల నుంచి ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటోంది. ఓ దశలో సిఎం కేసీఆర్ కూడా జోక్యం చేసుకుని భూపతిరెడ్డికి క్లాస్ తీసుకున్నారు. ఎమ్మెల్యే విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు.

కట్ చేస్తే ఇవాళ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ లీడర్లంతా జమయిన్రు. భూపతిరెడ్డి పార్టీ  వ్యతిరేక పనులు చేస్తున్నారని ఆ మీటింగ్ లో మాట్లాడుకున్నరు. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. పార్టీ ఇంఛార్జ్ తుల ఉమకు ఆ తీర్మానం కాపీ ఇచ్చి సిఎం కు ఇవ్వాలన్నారు.  పార్టీ లీడర్ల అభిప్రాయాలను ముఖ్యమంత్రికి అందిస్తానని తుల ఉమ చెప్పారు.

అసలేం జరిగింది?

ముఖ్యమంత్రి వార్నింగ్ తర్వాత భూపతిరెడ్డి, బాజిరెడ్డి ఇద్దరు సైలెంట్ అయ్యారు. కాదు కాదు సైలెంట్ అయినట్టు కనిపించారు. కాని లోపల కోల్డ్ వార్ ను కంటిన్యూ చేశారు. దీంతో పార్టీలో పెంట పెంట అయింది.

భూపతిరెడ్డి, బాజిరెడ్డి ఇద్దరిలో ఎవరో ఒకరే పార్టీలో ఉండాలన్న టాక్ నడిచింది. ఈ లాభనష్టాల లెక్కల బాజిరెడ్డి గెలిచిండు. భూపతిరెడ్డి ఓడిపోయిండు. దాని ఫలితంగానే ఇవాళ పోచారం ఇంట్లో సమావేశం, ఏకగ్రీవ తీర్మాణం, తుల ఉమ స్టేట్ మెంట్. ఇక టీఆర్ఎస్ నుంచి భూపతిరెడ్డి సస్పెన్షన్ అన్న వార్త రేపోమాపో వచ్చుడు ఖాయమన్నది ఇప్పుడు నిజామాబాద్ లో వినిపిస్తున్న ముచ్చట.