వైఎస్సార్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నాగారం గ్రామంలో ఆమె పర్యటిస్తున్నారు. మాట ముచ్చట పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో షర్మిలకు ఊహించని పరిణామం ఎదురైంది. షర్మిల పర్యటనను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె బృందంపై చెప్పులు విసిరారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ హోరెత్తించారు. ఈ హఠాత్పరిణామంతో షర్మిల షాకయ్యారు. కాగా, ఈ ఘటనతో నాగారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.