TRS VS BJP...KCR AUCTION PLAN
mictv telugu

ఫామ్‌హౌస్ ఎపిసోడ్..అసలు వాస్తవం ఇదేనా?

October 27, 2022

TRS VS BJP...KCR AUCTION PLAN

తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయా? కాంగ్రెస్‌ను సీన్‌లో లేకుండా చేయడమే లక్ష్యమా? కాంగ్రెస్ ఆటలో అరటిపండు అవుతుందా? పైకి మాటల యుద్ధం చేస్తున్నా.. ఆ రెండు పార్టీల టార్గెట్ ఒకటేనా? తెలంగాణలో పామ్ హౌజ్ ఎపిసోడ్ ని పరిశీలిస్తే ఇదే అవునని ప్రచారం జరుగుతోంది.

గ్రౌండ్ లెవల్ లెక్కలు

తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. పోటాపోటీ ఎవరి మధ్య అంటే ఠక్కున టీఆర్ఎస్-బీజేపీ గుర్తుకు వస్తుంది. ఈ టెంపోనే 2024 దాకా కొనసాగించాలి. రాజకీయాన్ని మలుపులు తిప్పుతూ రచ్చ రాజేస్తూనే ఉండాలి.నిజానికి టీఆర్ఎస్‌కు కావాల్సిందే ఇదే.ఎందుకంటే గ్రౌండ్‌లో గ్రామాలు, పట్టణాల్లో కేడర్ లేని పార్టీని ఈజీగా ఢీకొట్టొచ్చు. పనిలోపనిగా పల్లెల్లో గులాబీని పటిష్టం చేసుకునే అవకాశం వుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండు పర్యాయాలైనా చాలా గ్రామాల్లో స్ట్రాంగ్ కేడర్ లేదు. సంక్షేమ పనుల్ని ఓట్లుగా మలుచుకుంటున్నారే తప్ప పర్మినెంట్ ఓటు బ్యాంక్‌ని ఆ పార్టీ ఏర్పాటు చేసుకోలేకపోతుంది. అందుకే గ్రామాల్లో కేడర్ వున్న పార్టీ సీన్‌లోకి వస్తే విక్టరీ అంతా ఈజీకాదు.

కాంగ్రెస్ ఖేల్ ఖతమేనా?

తెలంగాణలో కాంగ్రెస్‌కు మంచి కేడర్ వుంది.ఆ పార్టీకి తెలంగాణ ఇచ్చిన సానుభూతి బోనస్.పల్లెల్లో ఇప్పటికి ఓటు బ్యాంక్ చెక్కుచెదరలేదు. కానీ వీరిని నడిపించే నాయకుడే లేడు. ఆపార్టీ నేతలు కేడర్ ని గాలికొదిలేసి గాంధీభవన్‌కే పరిమితమయ్యారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇంతే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమిచ్చి కాంగ్రెస్ క్యాష్ చేసుకోలేకపోయింది. అప్పుటినుంచి ఇప్పటిదాకా అలాగే కొనసాగుతుంది టీకాంగ్రెస్.. అప్పుడప్పుడు హడావుడి తప్పితే మిగతా ఏ సందర్భాల్లోనూ కేడర్‌ని పలకరించిన పాపానపోలేదు. రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. కార్యకర్తల్లో ఉరిమే ఉత్సాహం వచ్చింది.తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం అందరూ అనుకున్న సమయంలో ఒక్కసారిగా సీన్‌లోకి వచ్చింది. సీన్‌లో వుండటానికి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే వుంది. కానీ కాంగ్రెస్‌లో ఎవరిగోలవారిదే కదా… పార్టీ బాగుపడుతున్నా సీనియర్లు సహకరించరు.వీరి పంతాలు వీరివే. సీనియర్లమంటూ అంతఎత్తున లేస్తారు. సర్రున లేస్తున్న గ్రాఫ్ ని తొడగొట్టి మరి పడగొడతారు.రేవంత్ రెడ్డి వచ్చాక జరుగుతున్నది ఇదే.అయినా ఇవేవి లేక్కకుండా రేవంత్ అండ్ కో దూకుడు కొనసాగిస్తోంది. తగ్గేదేలే అంటూ మునుగోడులో కదనరంగంలోకి దిగింది.అంతేకాదు వచ్చే ఎన్నికల్లో రేసులో వున్నామని చెప్పేందుకు ప్రయత్నం చేస్తోంది.

సీన్‌లోకి రావొద్దంతేనా?

ఆ రెండు పార్టీల దారులు వేరు.సిద్దాంతాలు వేరు.పైకి ప్రత్యర్థులు. వీరలెవల్లో తిట్టుకుంటారు. ఢిల్లీ స్థాయిలో వార్ నడుస్తుంది.కానీ వీరి లక్ష్యం ఒక్కటే.. కొంచెం నిశితంగా తెలంగాణ రాజకీయాల్ని గమనిస్తే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతోంది.ఎందుకంటే ఎప్పుడూ రెండుపార్టీలే జనం నోళ్లల్లో ఉండాలి. వీటి గురించి మాట్లాడుతుండాలి. మచ్చుకైనా కాంగ్రెస్ గుర్తుకు రావొద్దు.తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌కు ఇదే కావాలి. కేంద్రంలో బీజేపీకి తెలంగాణలో కావాల్సింది ఇదే. దీనికోసమే రెండుపార్టీలు కలిసి లోపాయికారిగా ఒప్పందం చేసుకున్నాయని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పెద్దలతో సీఎం కేసీఆర్ టచ్ లో ఉన్నారని టాక్ నడుస్తోంది. అందులో భాగంగానే రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ ఎపిసోడ్ తెరపైకి తీసుకొచ్చారని ప్రచారం జరుగుతోంది. లోపల ఏం జరిగిందో ఏమోగానీ రెండుపార్టీల టార్గెట్ మాత్రం కాంగ్రెస్..ఎందుకంటే…

సర్వేలో ఏం తేలిదంటే

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకునే అలవాటు. ప్రతి ఆర్నెళ్లకోసారి సర్వే చేయించి రిపోర్ట్ తెప్పించుకుంటారు. ఎన్నికలు, ఉపఎన్నికలు వచ్చాయంటే నెలకోసారి చేయిస్తారు. అవసరమైతే వారానికోసారికి వెనుకాడరు.ఈ మధ్య చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయట. తెలంగాణలో చాలాచోట్ల ఊహించిన దాని కంటే కాంగ్రెస్ గ్రాఫ్ బలపడిందట. సడెన్‌గా పలు నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్‌లో ఉందట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు పది స్థానాల్లో కాంగ్రెస్ ద్వితీయస్థానంలో ఉందట. ఖమ్మంలోనూ ఇంతే. ఉత్తర తెలంగాణలో కూడా ఇంతేనట.రెండు, మూడుస్థానాల్లో తప్ప బీజేపీ సీన్ లేదట. నల్గొండలో కాంగ్రెస్ కు పట్టుంది.ఎమ్మెల్యేలు మారినా ఓటు బ్యాంక్ అలాగే ఉందట. మిగతా జిల్లాల్లో కాంగ్రెస్‌కు అంతో ఇంతో కాదు.. అంతకుమించిన గ్రాఫ్ పెరిగిందట. అందుకే టీఆర్ఎస్ కాంగ్రెస్‌ని ఆటలో అరటిపండు చేస్తుందని టాక్. రేసులో బీజేపీయే ఉండాలి. ఢీ కొడితే బీజేపీయేతోనే ఢీకొట్టాలి. ఎందుకంటే గ్రామాల్లో కేడర్ లేని కమలాన్ని ఈజీగా గెలువొచ్చని ప్లాన్. కాంగ్రెస్ రేసులో వుంటే కారుకు కష్టం. పరిస్థితులు అటు ఇటు అయితే భవిష్యత్ లో ఇబ్బందులు ఎదురవతాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది. అందుకే కాంగ్రెస్ ని సీన్‌లోకి రాకుండా చేయాలని ఆలోచిస్తుందట.

ఫామ్‌హౌస్ ఎపిసోడ్..రాహుల్ యాత్ర డైవర్ట్..!

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించింది. మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతోంది. ఫామ్‌హౌజ్ ఎపిసోడ్‌తో ఈ యాత్ర కవరేజ్ గాలికి కొట్టుకుపోయింది. కాంగ్రెస్ కార్యకర్తలు పట్టించుకోవట్లేదు. తెలంగాణ అంతా కొనుగోళ్ల వ్యవహారంపై మాట్లాడుకుంటున్నారు.ఇదే కేసీఆర్ మార్క్ డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు విశ్లేషకులు.

తొలి నుంచి టీఆర్ఎస్ అంతే…

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌ని ఎప్పుడూ ఎదగనివ్వలేదు. ఫస్ట్ టర్మ్‌లో డబుల్ డిజిట్ ఎమ్మెల్యేలున్నా పట్టించుకోలేదు.అసెంబ్లీలో విపక్షంగా ఉన్నా.. ఏనాడూ లెక్కచేయలేదు. అంతేకాదు హస్తం ఎమ్మెల్యేలపై ఆకర్ష్ గులాబీ వల విసిరింది. అంతే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. రెండో టర్మ్‌లో దాదాపు ఇంతే. విపక్షహోదాను సైతం లేకుండా చేశారు కేసీఆర్ తనదైన స్ట్రాటజీతో.అప్పటినుంచి ఇప్పటిదాకా అంతే. కాంగ్రెస్‌ని ఏ కోశాన కనిపించనివ్వడం లేదు. అప్పట్లో సీన్ లేని బీజేపీనే సీన్‌లోకి తెచ్చారు. ఎప్పుడూ వార్ సీన్‌లోనే వుంచుకున్నారు.2024 దాకా ఇదే కొనసాగేలా చూడాలని కేసీఆర్ యోచిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారినా అదే టార్గెట్. కేసీఆర్ పోటీ చేస్తామంటోన్న రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఆ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తే కాంగ్రెస్ కే నష్టం. బీజేపీకి పోయేదేం లేదంటారు విశ్లేషకులు.