TRS WIN IN MUNUGODE BYPOLL?
mictv telugu

నిశ్శబ్ద ఓటింగ్ ఆపార్టీని ముంచేస్తుందా?

November 4, 2022

మునుగోడు వార్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా టీఆర్ఎస్‌దే గెలుపు అంటున్నాయి. కేసీఆర్‌తో సహా ఆ పార్టీ నేతలు ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నారు. మరి బీజేపీ ఏమంటోంది.?నిశ్శబ్ధ ఓటింగ్‌నే నమ్ముకుందా?పెరిగిన ఓటింగ్ శాతం మునుగోడులో ముంచేస్తుందా?కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మొనగాడుగా నిలుపుతుందా?

చివరి రెండు గంటలు

మునుగోడు పోలింగ్‌లో చివరి రెండు గంటలు కీలకంగా మారాయి. పోలింగ్ సమయం ముగిసినా భారీగా క్యూలైన్లు ఉన్నాయి. గురువారం రాత్రి పదిన్నర వరకు పోలింగ్ జరిగింది. రికార్డ్ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదైంది. 2018 రికార్డ్‌ని క్రాస్ చేసింది. 2 లక్షల 41 ఓట్లకు గాను 2 లక్షల 24 వేలకుపైగా ఓట్లు పడ్డాయి. ఈసారి 92శాతం పోలింగ్ నమోదైంది. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం…టీఆర్ఎస్‌నే గెలిపిస్తుందా?ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? చివరి రెండుగంటలే ఫలితాన్ని డిసైడ్ చేయబోతున్నాయా? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఏడు గంటల్లోనే ఎగ్జిట్ పోల్స్..ఆ తర్వాత..?

ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 7గంటలకు ముందే వచ్చాయి. అంటే రాత్రి పదిన్నర దాకా జరిగిన పోలింగ్ పరిస్థితి ఏంటి? 5 గంటల తర్వాత దాదాపు 13 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఓట్లు ముందుగా ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పినట్టే టీఆర్ఎస్‌కు ఎక్కువగా పడ్డాయా?అంటే ఖచ్చితంగా చెప్పలేం. చివరి గంటలో ఏమైనా జరగొచ్చు. సరిగ్గా బీజేపీ కూడా దీనిపైనే ఆశలు పెట్టుకుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ అనామక సంస్థలు ఇచ్చినవే. ఇందులో పేరున్న సంస్థలు ఒక్కటీ లేవు. ఐదారుగురు కలిసి వేసిన అంచనాలే. అదీ సాయంత్రం ఏడు గంటలలోపే ఇచ్చేశారు. రాత్రి పదిన్నరదాకా సాగిన పోలింగ్ పర్సంటేజ్‌ని పట్టించుకోలేదు. అందుకే వీటిని నమ్మలేమని బీజేపీ అంటోంది.

బీజేపీ ధీమా ఇదే

మునుగోడు మార్నింగ్ సెషన్ పై బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టింది. ఈ టైమ్‌లో ఎక్కువశాతం ఓట్లు తమకే పడ్డాయని అనుకుంటోంది. ఆ తర్వాత మధ్యాహ్నం పోలింగ్ మందకోడిగా సాగింది. మళ్లీ మూడు గంటల తర్వాత ఊపందుకుంది. ఈ సమయంలో ఎక్కువమంది యువత వచ్చారని, ఆ ఓట్లు తమకే అనుకూలమని బీజేపీ అంచనావేస్తోంది. పోలింగ్ ముందురోజు అర్దరాత్రి నుంచి టీఆర్ఎస్ నాయకుల్ని డబ్బులు పంచకుండా అడ్డుకున్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పోలింగ్ రోజూ చాలా చోట్లటీఆర్ఎస్ డబ్బుల పంపిణీని తమ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. చివరి రెండు గంటల్లో పెరిగిన పోలింగ్ శాతం..వెరసి ఇవన్ని అనుకూలంగా ఉంటాయని బండి అండ్ కో అంచనా వేస్తుంది. కానీ టీఆర్ఎస్ వీళ్ల ఎక్స్‌పెక్ట్ చేసిన టైమ్‌కు ముందే పోల్ మేనేజ్మెంట్ పక్కాగా అమలు చేసిందని తెలుస్తోంది.ఇదే మునుగోడులో తమను ముంచేస్తుందేమోనని బీజేపీ కార్యకర్తలు కొందరు ఆందోళన చెందుతున్నారు.

హుజూరాబాద్ తప్పుల్ని రిపీట్ చేయని గులాబీదళం

మునుగోడు ఉప ఎన్నికలో చివరి మూడురోజుల్ని టీఆర్ఎస్ పక్కాగా ప్లాన్ చేసింది. ప్రత్యర్థి బీజేపీ అంచనాల్ని తలకిందులు చేసింది. హుజూరాబాద్‌లో చేసిన తప్పుల్ని ఇక్కడ రిపీట్ చేయలేదు. ఇదే ఇప్పుడు తమను గెలిపిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. నిజానికి గులాబీ పోల్ మేనేజ్మెంట్ అనుకున్నా టైమ్ కంటే ముందే పక్కాగా సాగింది. ఆ తర్వాత మిగిలిన సమయం అంతా బీజేపీపైనే ఫోకస్ చేసింది. ఎక్కడ డబ్బులు పంచనీయకుండా అడ్డుకుంది. ఇదే బీజేపీకి పెద్ద మైనస్..తమకు ప్లస్ అని టీఆర్ఎస్ నాయకులు అంచనావేస్తున్నారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ కూడా విజయానికి సంకేతమని వారు చెబుతున్నారు