కండ్లకలకతో బాధపడుతున్న కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

కండ్లకలకతో బాధపడుతున్న కేటీఆర్

April 16, 2019

మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కండ్లకలకతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీనిని సంబంధించిన ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశారు. కండ్లకలక వలన సోమవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి కూడా హాజరు కాలేకపోయారు.

ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి హాజరైన కేటీఆర్‌ కళ్లలో ఏదో ఇబ్బందిగా ఉండడంతో వెంటనే వెళ్లి డాక్టర్లను కలిశారు. కళ్లను పరీక్షించిన వైద్యులు కండ్లకలక సోకిందని తెలిపి వైద్యం అందించారు. కళ్లు బాగా ఎర్రగా మారి ఇబ్బంది పెడుతుండడంతో నాలుగు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో కేటీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు.