Home > Featured > తెలంగాణకు నరసింహన్ తండ్రిలా తోడున్నారు..కేటీఆర్

తెలంగాణకు నరసింహన్ తండ్రిలా తోడున్నారు..కేటీఆర్

తెలంగాణ ఏర్పడకముందు ఐదేళ్లు, తెలంగాణ రాష్టంగా ఏర్పడ్డాక ఐదేళ్లు మొత్తం దశాబ్దం పాటు రాష్ట్ర గవర్నర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్ సేవలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ఈమేర ట్విట్టర్‌లో ఆయనకు వీడ్కోలు తెలిపారు.

ఎన్నోసార్లు, విభిన్న అంశాలపై నరసింహన్‌తో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు తెలంగాణ ఏర్పాటు తర్వాత మొత్తంగా రాష్ట్రానికి పదేళ్లపాటు సుదీర్ఘ కాలం పాటు గవర్నర్‌గా నరసింహన్ సేవలందించారన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి నరసింహన్ విలువైన మార్గనిర్దేశం చేశారన్నారు. పదేళ్ల పాటు తెలంగాణకు తండ్రిలాంటివాడుగా, సంరక్షకుడిగా ఉన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నరసింహన్‌కు మంచి ఆరోగ్యం, ప్రశాంతత లభించాలని ఆకాంక్షించారు.

Updated : 1 Sep 2019 4:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top