ఆ మానవ మృగానికి ఉరి..స్వాగతించిన కేటీఆర్‌ - MicTv.in - Telugu News
mictv telugu

ఆ మానవ మృగానికి ఉరి..స్వాగతించిన కేటీఆర్‌

August 9, 2019

 

వరంగల్‌‌లో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం కేసులో దోషి ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధిస్తూ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పును యావత్ సభ్య సమాజం స్వాగతిస్తుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కేటీఆర్‌ జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతీస్తూ ట్వీట్ చేశారు. నేరానికి పాల్పడిన కామోన్మాది ప్రవీణ్‌ను మానవ మృగంగా కేటీఆర్ అభివర్ణించారు. ఇలాంటి భయంకరమైన నేరస్థులను సమాజం నుంచి తరిమికొట్టాలంటే చట్టాలు మరింత కఠినంగా ఉండాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. దోషికి శిక్ష పడేలా చేసిన పోలీసులు, న్యాయవాదులకు అభినందనలు తెలిపారు.