వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని టిఆర్ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళిని ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. అనిశెట్టి మురళిపై వేట కొడవళ్లతో ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. పాతకక్షలే మురళి హత్యకు కారణం అని పోలీసులు చెబుతున్నారు. అత్యంత దారుణంగా ఈ హత్యకు పాల్పడ్డారు దుండగులు. నరికిన తర్వాత తలను, మొండేం ను వేరువేరుగా పడేశారు. మురళిని హత్య చేసిన అనంతరం నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఇటీవల కాలంలోనే అనిశెట్టి మురళి టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరారు. మురళి ప్రాణ రక్షణ కోసమే అధికార పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆయన ప్రత్యర్థుల చేతిలో మృతి చెందక తప్పలేదు. గతంలో కార్పొరేటర్ జనార్దన్ హత్య జరిగింది. ఈ హత్య కేసులో అనిశెట్టి మురళి కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జనార్దన్ వర్గీయులే తాజాగా ముళిని దారుణంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం నిందితులంతా హన్మకొండ పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.