trsiha suffer leg injury
mictv telugu

అయ్యో..త్రిష కాలికి ఏమైంది.. ?

November 6, 2022

trsiha suffer leg injury

అందం, అభినయంతో ఆకట్టుకునే హీరోయిన్‌లలో త్రిష ఒకరు. 39 ఏళ్ల వయస్సులో కూడా తగ్గేదే లే అంటూ నేటి తారలకు పోటీగా నటిస్తున్నారు.తాజాగా పొన్నియన్ సెల్వం-1 చిత్రంలో కుందవై పాత్రలో నటించి మెప్పించారు. ఆ చిత్రం తర్వాత మలయాళం సినిమా ‘రామ్’లో త్రిష నటిస్తోంది.

మోహన్లాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యాక అట్నుంచి యూరోపియన్ కంట్రీస్‌కి వెకేషన్‌కి యూకే వెళ్లింది. అయితే అక్కడ గాయపడడంతో వెకేషన్ మధ్యలోనే తిరిగి వెనక్కు వచ్చేసింది. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో త్రిష కాలికి గాయమైంది. స్కానింగ్‌లో ఎముకకి చిన్న చీలిక ఉన్నట్లు తేలింది. దాంతో కొన్ని రోజుల పాటు ఆమె సినిమాలకి దూరంగా ఉండబోతోంది. ఈ మేరకు ఒక ఫొటోని కూడా త్రిష షేర్ చేసింది. పొన్నియన్ సెల్వం-1 చిత్రం తర్వాత త్రిషకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ చేతిలో ఇప్పుడు ఓ 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి.