టీఆర్టీ దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్టీ దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు

November 30, 2017

టీఆర్టీ అభ్యర్థులకు శుభవార్త.  తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ) నోటిఫికేషన్ గడువును టీఎస్పీఎస్సీ పొడిగించింది. నవంబర్ 30తో ముగియనున్న గడువును డిసెంబర్ 15వరకు పొడిగించారు. విద్యాశాఖ అభ్యర్థన మేరకు గడుపు పెంచాలని టీఎస్పీఎస్సీ గురువారం తెలిపింది. రాష్ట్రంలో 8,792 పో స్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. 31 జిల్లాల ప్రా తిపదికన ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలనుకున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పాత జిల్లాల ప్రాతిపదికన నియామకాలు జరగనున్నాయి. నోటిఫికేషన్‌ను సవరించాలని, అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి విధించిన గడువును మరో 15 రోజులు పొడిగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గడువు పొడిగించారు.

జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టులు

నల్లగొండ జిల్లాలో 190, సూర్యాపేట జిల్లాలో 156, యాదాద్రిభువనగిరి జిల్లాలో 128 ఉపాధ్యా య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నల్లగొండ జిల్లా లో ఎస్‌జీటీ 26, ఎస్‌ఏ 110, భాషా పండితులు 37, పీఈటీ 17, సూర్యాపేట జిల్లాలో ఎస్‌జీటీ 8, ఎస్‌ఏ 106, భాషా పండితులు 27, పీఈటీ 15, యాదాద్రిభువనగిరి జిల్లాలో ఎస్‌జీటీ 6, ఎస్‌ఏ 71, భాషా పండితులు 31, పీఈటీలు 20 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాల ప్రకారం పోస్టులు భర్తీ చేయాలని కోర్టు తీర్పునివ్వడంతో అధికారులు ఉమ్మడి జిల్లా ఆధారంగా పోస్టుల సంఖ్యపై తుదిజాబితా తయారీలో నిమగ్నమయ్యారు.