టీఆర్టీ వాయిదా పడదు.. త్వరలో 31వేల కొలువులు - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్టీ వాయిదా పడదు.. త్వరలో 31వేల కొలువులు

January 30, 2018

తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ) వాయిదా పడుతుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేని, షెడ్యూలు ప్రకారం పరీక్ష జరుతుందని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మంగళవారం స్పష్టం చేశారు. ఏప్రిల్, మే ఆఖరులోగా పరీక్షల ప్రక్రియ పూర్తిచేస్తామని,  వచ్చే జూన్ నాటికి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు.అభ్యర్థులు ఏవైనా అనుమాలనుంటే తమను సంప్రదించొచ్చని తెలిపారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే గ్రూప్- 2 ఉద్యోగాలను కూడా  భర్తీ చేస్తామని తెలిపారు. దేశంలో తెలంగాణలో ఎక్కువ ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయని ఆయన వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలో 31 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వివరించారు.